Hyderabad, ఫిబ్రవరి 7 -- పాలకోవా పేరు చెబితేనే తెలుగువారికి నోరూరిపోతుంది. ఎన్ని స్వీట్లు ఉన్నా పాలకోవా ప్రత్యేకతే వేరు. దీన్ని ఇష్టపడని వారు ఉండరు. పాలకోవా చేయాలంటే బోలెడన్నీ పాలు కావాలి. అప్పటికప్పుడు ఈ స్వీట్ ను తయారుచేసుకుని తినాలనిపిస్తే పాలతోనే కాదు పాలపొడితో కూడా చేయవచ్చు. కొన్ని నిమిషాల్లోనే ఈ స్వీట్ ను తయారుచేసుకోవచ్చు.

పాలపొడితో కోవా తయారు చేయడం చాలా సులభం. తక్కువ పదార్థాలతో ఇంట్లో రుచికరమైన నోరూరించే కోవా ఎలా తయారుచేయాలో ఇక్కడ ఇచ్చాము. పిల్లలు కూడా దీనిని ఇష్టపడతారు. ఏదైనా పండుగల సమయంలో, ఇంటికి అతిథులు వచ్చినప్పుడు ఈ సులభమైన రెసిపీని ప్రయత్నించండి.

పాలు - 1 కప్పు

పాలపొడి - పావు కిలో

నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు

పంచదార పొడి - పావు కప్పు

కుంకుమపువ్వు - చిటికెడు

యాలకుల పొడి - పావు స్పూన్

ఈ కోవాలను నోట్లో పెడితే కరిగిపోయే...