భారతదేశం, మార్చి 12 -- Pakistan train hijack: పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ ప్రావిన్స్ లో మంగళవారం ప్యాసింజర్ రైలును బలూచ్ తీవ్రవాదులు హైజాక్ చేసిన ఘటనలో ఆ దేశ భద్రతా దళాలు 16 మంది హైజాకర్లను హతమార్చగా, 104 మంది ప్రయాణికులను రక్షించారు. తొమ్మిది బోగీల్లో 400 మంది ప్రయాణికులతో జాఫర్ ఎక్స్ ప్రెస్ క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తుండగా బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA)కి చెందిన సాయుధులు మంగళవారం మధ్యాహ్నం గుడాలార్, పీరు కున్రి పర్వత ప్రాంతాలకు సమీపంలోని టన్నెల్ లో అడ్డుకున్నారు. డ్రైవర్ పై కాల్పులు జరిపి, రైలును తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

హైజాక్ చేసిన రైలులోని సెక్యూరిటీ సిబ్బందిని వారి ఐడీ కార్డుల ఆధారంగా బలూచ్ తీవ్రవాదులు గుర్తించి, వారిని హతమార్చారు. సమాచారం తెలియగానే, పాక్ హోం మంత్రిత్వ శాఖ హుటాహుటిన భద్రతాబలగాలను ఘటనాస్థలానికి పంపించి, ఆపరేషన్...