భారతదేశం, మార్చి 15 -- Pakistan train hijack: 214 మంది బందీలను చంపేశామని బలూచిస్తాన్ లో పాకిస్తాన్ రైలు హైజాక్ కు తామే బాధ్యులమని ప్రకటించిన వేర్పాటువాద సంస్థ బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. ఇందుకు పాక్ మొండి పట్టుదలే కారణమని ఆరోపించింది. హైజాక్ చేసిన ట్రైన్ నుంచి 214 మందిని తప్పించి, వారిని తమతో పాటు తీసుకువెళ్లి, హతమార్చామని వెల్లడించింది.

పాక్ బలగాలకు తాము 48 గంటల సమయం ఇచ్చామని, దానిని వారు పట్టించుకోలేదని, ఫలితంగా 214 మంది బందీలు మరణించారని బీఎల్ఏ అధికార ప్రతినిధి జీయాంద్ బలోచ్ ఒక ప్రకటన విడుదల చేశారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాక్ సైన్యానికి 48 గంటల అల్టిమేటం ఇచ్చిందని, తమ సిబ్బంది ప్రాణాలను కాపాడేందుకు పాక్ సైన్యానికి ఇదే చివరి అవకాశమని చెప్పామని పేర్కొన్నారు. ''అయితే పాకిస్తాన్ తన సంప్రదాయ మొండితనాన్ని, సైనిక అహంకారాన్ని ప్రదర్శిస్...