భారతదేశం, ఫిబ్రవరి 28 -- ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‍కు ఘోర పరాభవం ఎదురైంది. సొంతగడ్డపై జరుగుతున్న టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా గెలువకుండా గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. వాన వల్ల బంగ్లాదేశ్‍తో మ్యాచ్ రద్దవటంతో ఒక్క పాయింట్ మాత్రమే సాధించింది. న్యూజిలాండ్, భారత్ చేతిలో ఓడింది. మరోవైపు, అఫ్గానిస్థాన్ మాత్రం సంచలనం సృష్టించింది. ఇంగ్లండ్‍ను ఓడించి సెమీస్ రేసులో ఉంది.

ఛాంపియన్స్ ట్రోఫీలో అఫ్గాన్ జట్టు ప్రదర్శనపై పాకిస్థాన్ టీవీ ఛానెల్ షో 'డ్రెస్సింగ్ రూమ్'లో చర్చ జరిగింది. తన తదుపరి మ్యాచ్‍లో ఆస్ట్రేలియాను ఓడించి అఫ్గానిస్థాన్ సెమీఫైనల్ చేరగలదా అనే ప్రశ్న పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వకార్ యూనిస్‍కు ఎదురైంది.

ఇంగ్లండ్‍తో మ్యాచ్‍లో అఫ్గానిస్థాన్ అద్భుతంగా ఆడి గెలిచిందని వకార్ యూనిస్ అన్నారు. కానీ అఫ్గాన్‍పై ఆస్ట్రేలియా ఏకపక్...