Hyderabad, జనవరి 26 -- Padma Awards 2025 In Arts With Balakrishna Ajith: 2025 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మ శ్రీ మూడు అవార్డులు కలిపి మొత్తంగా 139 మందికి వచ్చాయి.

పద్మ విభూషణ్ అవార్డ్‌కు ఏడుగురు, పద్మ భూషణ్‌కు 19 మంది, పద్మ శ్రీ పురస్కారాలను 113 మంది అందుకోనున్నారు. అయితే, వీరిలో బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డ్ వచ్చిన విషయం తెలిసిందే. ఇలా సినీ రంగం లేదా కళల విభాగంలో మొత్తంగా 48కి పద్మ అవార్డ్స్ వరించాయి. వీరిలో సౌత్ నుంచి సినీ రంగం విభాగంలో నలుగురు పద్మ భూషణ్‌కు ఎంపిక అయ్యారు.

ఆంధ్ర ప్రదేశ్ నుంచి బాలకృష్ణకు, కన్నడ నటుడు అనంత్ నాగ్ (కర్ణాటక), తమిళ స్టార్ హీరో ఎస్ అజిత్ కుమార్ (తమిళనాడు), బాలీవుడ్ డైరెక్టర...