Hyderabad, జనవరి 26 -- Pawan Kalyan Wishes To Padma Awards 2025 Balakrishna: తాజాగా 2025 సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. పలు కళల్లో విశేష సేవలు అందించినవారికి ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. గణతంత్ర దినోత్సవం సందర్బంగా జనవరి 25న మొత్తంగా 139 మందికి ఈ అవార్డులు వరించాయి.

పద్మ విభూషణ్ అవార్డ్‌కు ఏడుగురు, పద్మ భూషణ్‌కు 19 మంది, 113 మంది పద్మ శ్రీ పురస్కారాలను అందుకోనున్నారు. వీరిలో తెలంగాణకు చెందిన దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి వైద్య విభాగంలో పద్మ విభూషణ్ అవార్డ్ వరించగా.. ఆంధ్రప్రదేశ్ నుంచి కళల కేటగిరీలో నందమూరి బాలకృష్ణ పద్మ భూషణ్ పురస్కారానికి ఎంపిక అయ్యారు. ఈ నేపథ్యంలో పద్మ అవార్డ్స్ అందుకున్న వీరికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు.

"ఐదు దశాబ్దాలపైబడి తెలుగు చలనచి...