Hyderabad, ఫిబ్రవరి 12 -- ఏవియేషన్ రంగంలో వచ్చిన విప్లవం సామాన్యులకు విమాన ప్రయాణాన్ని సులభతరం చేసింది.ఉడాన్ పథకం వల్ల సామాన్యుడికి విమాన ప్రయాణ సౌలభ్యం లభిస్తోంది. చౌక ధరలకు టిక్కెట్లు లభిస్తుండడంతో, విమానయాన సంస్థల నుంచి అనేక ఆఫర్లు కూడా ఇస్తున్నాయి.

ఏవియేషన్ రూట్, ఫీల్డ్ పై మీకు ఆసక్తి ఉంటే కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలు ఇక్కడ చెప్పాము. విమానాలు ఆకాశంలో ఎగురుతాయి. కాబట్టి ఆకాశంలో ఎత్తుగా ఎగురుతూ ఏ ప్రాంతంలోనైన ఎగిరిపోతాయని ఎంతో మంది అనుకుంటారు. కానీ విమానాలు కొన్ని ప్రాంతాల మీద నుంచి ఎగరవు. అందులో ముఖ్యమైనది పసిఫిక్ మహా సముద్రం. పసిఫిక్ మహాసముద్రం మీదుగా ప్రయాణించే విమానాలు చాలా తక్కువనే చెప్పాలి. వాస్తవానికి, విమానయాన సంస్థలు ఆ ప్రాంతం గుండా ప్రయాణించాల్సి వస్తే, సమీప మార్గానికి బదులుగా ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుంటాయి. పసిఫిక్ మహాసము...