Hyderabad, ఫిబ్రవరి 5 -- పచ్చిమిరపకాయలను కూరల్లో కారంగా ఉండేందుకు వేస్తూ ఉంటారు. నోరు చప్పగా అనిపించినప్పుడు పచ్చిమిరపకాయ పచ్చడి చేసుకొని తినేందుకు ప్రయత్నించండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వేడిగా అన్నంలో కలుపుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. మీకు ఆరోగ్యం బాగోలేనప్పుడు వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలా స్పైసీ ఆహారాన్ని తింటే ఆ రుచే వేరు. పైగా పచ్చిమిర్చిలో పోషకాలు కూడా నిండుగా ఉంటాయి. కాబట్టి ఈ పచ్చిమిర్చి పచ్చడి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇక రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

పచ్చిమిరపకాయలు - పావుకిలో

చింతపండు - ఉసిరికాయ సైజులో

జీలకర్ర - ఒకటిన్నర స్పూను

మెంతులు - అర స్పూను

ఉల్లిపాయలు - ఒకటి

నూనె - రెండు స్పూన్లు

పచ్చిశనగపప్పు - ఒక స్పూను

మినప్పప్పు - ఒక స్పూను

ఆవాలు - అర స్పూను

వెల్లుల్లి - మూడు

కరివేపాకులు - గుప్పెడు

పసుపు ...