తెలంగాణ,హైదరాబాద్, మార్చి 27 -- ఉస్మానియా యూనివర్శిటీలో పీహెచ్డీ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఆన్ లైన్ దరఖాస్తుల గడువు ముగిసింది. దీంతో పరీక్షల నిర్వహణపై అధికారులు దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా. పరీక్షల తేదీలతో పాటు షెడ్యూల్ వివరాలను ప్రకటించారు.

ఓయూ పీహెచ్డీ ప్రవేశాల కోసం నిర్వహించే ఎంట్రెన్స్ పరీక్షలు ఏప్రిల్ 25 నుంచి ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 27వ తేదీతో అన్ని సబ్జెక్టుల ఎగ్జామ్స్ ముగుస్తాయని తేజా ప్రకటనలో పేర్కొన్నారు. ఎంట్రెన్స్ టెస్ట్ కోసం కంప్యూటర్ బేస్డ్‌ పరీక్ష నిర్వహిస్తారు.

ప్రతిరోజూ మూడు సెషన్లు ఉంటాయి. ఉదయం సెషన్ 09.30 AM నుంచి 11.00 గంటల మధ్య ఉంటుంది. ఇక రెండో సెషన్ 12.30 PM to 02.00 గంటల వరకు, మూడో సెషన్ 03.30 PM to 05.00 గంటల మధ్య నిర్వహిస్తారు. లాంగ్వేజ్స్ సబ్జెక్టులు తప్ప ఎంట్రెన్స్‌ పరీక్ష ఇంగ్లీష్‌ భాషలోనే...