తెలంగాణ,ఉస్మానియావర్శిటీ,హైదరాబాద్, మార్చి 14 -- ఉస్మానియా యూనివర్శిటీలో పీహెచ్డీ అడ్మిషన్ల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మార్చి 11వ తేదీతో గడువు ముగియగా... తాజాగా అధికారులు సమయాన్ని పొడిగించారు. రూ. 2వేల ఫైన్ తో మార్చి 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని తెలిపారు.

ఏప్రిల్ 25 నుంచి 27 తేదీల్లో పీహెచ్డీ ప్రవేశాల పరీక్షలను నిర్వహిస్తామని ఓయూ అధికారులు తెలిపారు. అయితే సబ్జెక్టుల వారీగా వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఎంట్రెన్స్ టెస్ట్ కోసం కంప్యూటర్ బేస్డ్‌ పరీక్ష నిర్వహిస్తారు. లాంగ్వేజ్స్ సబ్జెక్టులు తప్ప ఎంట్రెన్స్‌ పరీక్ష ఇంగ్లీష్‌ భాషలోనే నిర్వహిస్తారు. అర్హత పరీక్షలో కనీసం 50శాతం మార్కులు సాధించిన వారిని క్వాలిఫైడ్‌గా గుర్తిస్తారు. ఓసీ అభ్యర్ధులక...