భారతదేశం, ఫిబ్రవరి 7 -- ట్ఉస్మానియా యూనివర్శిటీ దూర విద్యలో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 2025 - 2026 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాలు కల్పించనున్నారు. రెండేళ్లపాటు కోర్సు వ్యవధి ఉంటుంది.

ఈ ప్రవేశాల కోసం ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 18వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. రూ. 500 ఆలస్య రుసుంతో ఫిబ్రవరి 21వ తేదీ వరకు అవకాశం కల్పించారు.

ఇందుకు సంబంధించిన రాత పరీక్ష ఫిబ్రవరి 22వ తేదీన నిర్వహిస్తారు. గతేడాది నిర్వహించిన తెలంగాణ ఐసెట్ ఎంట్రెన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మాత్రం నేరుగా అడ్మిషన్లు కల్పిస్తారు. వీరు ప్రత్యేకంగా ఎంట్రెన్స్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.

ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు అప్లయ్ చేసుకునే అభ్యర్థులు. డిగ్రీ పాసై ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ ...