తెలంగాణ,హైదరాబాద్, మార్చి 29 -- ఉస్మానియా యూనివర్సిటీ దూర విద్యా కేంద్రమైన ప్రొఫెసర్ జి.రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (పీజీఆర్ఆర్సీడీఈ)లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా.... 2024 - 2025 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫేజ్ 2 కింద యూజీ, పీజీ, డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఇప్పటికే ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ నడుస్తుండగా.... మరో రెండు రోజుల్లో గడువు పూర్తవుతుంది. అర్హులైన వారు మార్చి 31లోపు అప్లికేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

మొత్తం 72 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు మార్చి 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా కోర్సులను అనుసరించి ఏడాది నుంచి మూడేళ్ల వరకు ఉంటుంది. డిప్లోమా కోర్సుల వ్యవధి సంవత్సరం. డిగ్రీ మూడేళ్లు, పీజీ రెండేళ్ల వ్యవధి ఉంటుంది. సెమిస్టర్ విధానంలో పరీక్షల...