Hyderabad, మార్చి 4 -- OTT Movies On Womens Day 2025 Special: ఓటీటీల్లో అనేక రకాల కంటెంట్‌తో సినిమాలు స్ట్రీమింగ్ అవుతోన్నాయి. అయితే, మార్చి 8న అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా మహిళల సాధికారతను పెంపొందించే, మహిళల్లో స్ఫూర్తినింపే బెస్ట్ 5 పవర్‌ఫుల్ ఓటీటీ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

పింక్ మూవీ ఒక శక్తివంతమైన సోషల్ థ్రిల్లర్ మూవీ. లైంగిక స్వేచ్ఛ, వేధింపులు, మహిళ అంగీకారం తప్పనిసరి, మహిళలు ఎదుర్కొనే సాంఘిక సమస్యల వంటి అంశాలతో ఎంగేజింగ్‌గా తెరకెక్కింది పింక్. తమ గౌరవం, న్యాయం కోసం పోరాడే ముగ్గురు మహిళల పటిమను చూపిస్తూ స్ఫూర్తినింపే పింక్ జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, ప్లెక్స్, గూగుల్ ప్లే మూవీస్, యాపిల్ టీవీ, యూట్యూబ్ వంటి 6 ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఆర్ఆర్ఆర్ సీత అలియా భట్ నటించిన హిందీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రాజీ. నిజ ...