Hyderabad, మార్చి 7 -- OTT Weekend Watch: ఓటీటీలోకి ఈ వారం లెక్కకు మిక్కిలి సినిమాలు వచ్చాయి. వాటిలో కొన్ని మాత్రమే స్పెషల్. వీటిలో కొన్ని నేరుగా తెలుగులో వచ్చిన సినిమాలు కాగా.. మరికొన్ని మలయాళం, తమిళ భాషల నుంచి డబ్ అయినవి కూడా ఉన్నాయి. మరి ఆ సినిమాలు, వెబ్ సిరీస్ ఏంటి? ఎక్కడ చూడాలన్నది తెలుసుకోండి.

రేఖాచిత్రమ్ ఓ మలయాళ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ ఏడాది ఆ భాషలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఇది. ఆసిఫ్ అలీ నటించాడు. 40 ఏళ్ల కిందటి మర్డర్ మిస్టరీని పరిష్కరించడానికి ప్రయత్నించే ఓ పోలీస్ ఆఫీసర్ కథే ఈ రేఖాచిత్రమ్. ఈ సినిమాలో సోనీ లివ్ ఓటీటీలో గురువారం (మార్చి 6) నుంచి తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

ది సీక్రెట్ ఆఫ్ వుమెన్ ఓ మలయాళ ఎమోషనల్ థ్రిల్లర్ డ్రామా. ఇది రెండు జంటల చుట్టూ తిరిగే స్టోరీ. క్రైమ్, థ్రిల్లర్ కలగలపి తీసిన మూవీ ఇది. థి...