భారతదేశం, ఫిబ్రవరి 21 -- ఈనెల ఫిబ్రవరి చివరి రోజున 28వ తేదీ ఓటీటీల్లో రెండు అవైటెడ్ వెబ్ సిరీస్‍లు స్ట్రీమింగ్‍కు రానున్నాయి. రెండు ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. సూపర్ సక్సెస్ అయిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ సుడల్: ది వర్టెక్స్ సిరీస్‍కు రెండో సీజన్ స్ట్రీమింగ్‍కు రానుంది. జ్యోతిక లీడ్ రోల్ చేసిన మరో థ్రిల్లర్ సిరీస్ అడుగుపెట్టనుంది. ఈ రెండు వెబ్ సిరీస్‍ల వివరాలు ఇవే..

డబ్బా కార్టెల్ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 28వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‍లో షబానా ఆజ్మీ, జ్యోతిక, గిరిజా రావ్, నిమిషా సంజయన్, షాలినీ పాండే, సాయి తంహన్‍కర్ లాంటి పాపులర్ నటీమణులు ప్రధాన పాత్రలు పోషించారు. జిస్సు సెంగుప్తా, లిల్లెట్ దూబే, భూపేంద్ర సింగ్ జడావత్ కీలకపాత్రలు చేశారు. ఫుడ్‍ను క్యారేజీల్లా అందించే డబ...