Hyderabad, జనవరి 27 -- Malayalam Violent Film Marco OTT Release: మలయాళం నుంచి మోస్ట్ వయెలెంట్ మూవీగా వచ్చింది మార్కో. ఇదివరకు మోస్ట్ వయెలెంట్ చిత్రాలుగా రికార్డుకెక్కిన జాన్ విక్, కిల్ సినిమాలను మించి మార్కో ఉందని కామెంట్స్ వినిపించాయి. గతేడాది డిసెంబర్ 20న మలయాళంలో థియేటర్లలో విడుదలైన మార్కో సెన్సేషనల్ హిట్ అందుకుంది.

మార్కోకు వచ్చిన క్రేజ్‌తో తెలుగులో కూడా రిలీజ్ చేశారు. ఈ ఏడాది జనవరి 1న థియేటర్లలో మార్కో తెలుగు వెర్షన్‌తో రిలీజ్ అయింది. తెలుగులో కూడా అదిరిపోయే కలెక్షన్స్‌తో మార్కో సత్తా చాటింది. రూ. 30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన మార్కో సుమారుగా ఇప్పటికీ రూ. 115 కోట్లకుపైగా కలెక్షన్స్ అందుకుంది. అలాగే, ఏ సెన్సార్ సర్టిఫికేట్‌తో వంద కోట్ల క్లబ్‌ దాటిన తొలి సినిమాగా మార్కో రికార్డ్ క్రియేట్ చేసింది.

జనతా గ్యారేజ్, భాగమతి, యశోద, మాలికాప...