Hyderabad, ఫిబ్రవరి 26 -- OTT Vertical Web Series: మొబైల్ చేతిలో ఉంటే ప్రపంచమే మీ చేతుల్లో ఉన్నట్లే. ఓటీటీలో ఉన్న మొత్తం కంటెంట్ ను మొబైల్ లోనూ చూడొచ్చు. అయితే ఏ సినిమా చూడాలన్నా, వెబ్ సిరీస్ చూడాలన్నా మొబైల్ ను అడ్డంగా తిప్పాల్సిందే. కానీ ఆ అవసరం లేకుండా తొలిసారి ఓటీటీ చరిత్రలో వర్టికల్ వెబ్ సిరీస్ వస్తోంది.

ఆహా తమిళం ఓటీటీ ఓ వినూత్న ప్రయోగానికి తెర తీస్తోంది. ఇండియాలో తొలిసారి ఓ వెబ్ సిరీస్ ను వర్టికల్ ఫార్మాట్లో తీసుకొస్తోంది. అంటే మీ మొబైల్ ను అడ్డం తిప్పి చూడాల్సిన అవసరం లేకుండా సరికొత్త అనుభూతిని కలిగించేందుకు సిద్ధమవుతోంది. తొలిసారి ఈ ఫార్మాట్లో అప్సర (Apsara) అనే ఫ్యాంటసీ జానర్ వెబ్ సిరీస్ వస్తోంది.

గతంలో ఎన్నడూ లేని విధంగా మీ మొబైల్లో నిలువుగా ఈ సిరీస్ చూడొచ్చు. అత్యాధునిక స్టోరీటెల్లింగ్, ఇన్నోవేషన్ ను కలగలిపి మొబైల్ ప్రేక్షకు...