Hyderabad, ఫిబ్రవరి 4 -- OTT Valentine's Day Releases: వాలెంటైన్స్ డే స్పెషల్ మూవీస్, వెబ్ సిరీస్ కొన్ని ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్, ఈటీవీ విన్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి ఇవి రానున్నాయి. ఈ సినిమాలు, వెబ్ సిరీస్ జాబితాలో ధూమ్ ధామ్, లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్, సమ్మేళనం, మార్కో, ప్యార్ టెస్టింగ్ లాంటివి ఉన్నాయి. మరి ఏ మూవీ, వెబ్ సిరీస్ ఎక్కడ చూడాలో తెలుసుకోండి.

వాలెంటైన్స్ డే కోసం ప్రతి ఏటా ప్రేమ పక్షులు ఎదురు చూస్తూ ఉంటాయి. ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమవుతున్న వాళ్లు ఓటీటీలోకి వస్తున్న ఈ సినిమాలు, వెబ్ సిరీస్ కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు.

మలయాళ యాక్షన్ థ్రిల్లర్, మోస్ట్ వయోలెంట్ మార్కో ఓటీటీలోకి వచ్చేస్తోంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది...