భారతదేశం, మార్చి 16 -- బాలీవుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషించి, దర్శకత్వం వహించిన 'ఎమర్జెన్సీ' మూవీపై ముందు నుంచి బజ్ నెలకొంది. ఈ మూవీపై వివాదాలు, అభ్యంతరాలు కూడా వినిపించాయి. 1975లో ఇండియాలో ఎమర్జెన్సీ విధించిన ఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీలో మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పాత్రను కంగనా రనౌత్ పోషించారు. అయితే, ఈ ఏడాది జనవరి 17వ తేదీన రిలీజైన ఎమర్జెన్సీ మూవీ డిజాస్టర్ అయింది. అయితే, ప్రస్తుతం ఓటీటీలో సత్తాచాటుతోంది.

ఎమర్జెన్సీ మూవీ ప్రస్తుతం (మార్చి 16) నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో టాప్‍లో ట్రెండ్ అవుతుంది. నెట్‍ఫ్లిక్స్ ఇండియా సినిమాల ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍కు దూసుకొచ్చింది. ఈ మూవీ మార్చి 14వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. హిందీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లిష్ సబ్‍టైటిల్స్ అందుబాట...