భారతదేశం, జనవరి 24 -- ఓటీటీలోకి ఇప్పటివరకు ఎన్నో రకాల మర్డర్ మిస్టరీలు, క్రైమ్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చి అలరించాయి. ప్రతి వారం ఇలాంటి తరహా జోనర్లలతో ఏదో ఒక సినిమా వస్తూనే ఉంటుంది. అయితే, పాడ్‌కాస్ట్ నేపథ్యంతో మాత్రం ఇప్పటివరకు ఎలాంటి క్రైమ్ థ్రిల్లర్ రాలేదు.

ఒక యూనిక్ పాయింట్‌తో లేటెస్ట్ ఓటీటీలోకి నేరుగా స్ట్రీమింగ్‌కు వచ్చిన తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీనే చీకటిలో. హీరో నాగ చైతన్య భార్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు.

చీకటిలో సినిమాలో శోభితతోపాటు విశ్వదేవ్ రాచకొండ, చైతన్య, విశాల లక్ష్మీ, ఝాన్సీ, ఆమని, వడ్లమాని శ్రీనివాస్, రవీంద్ర విజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. వీరితోపాటు ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ ఇషా చావ్లా కూడా కీ రోల...