భారతదేశం, జనవరి 28 -- జనవరి చివరి వారంలో కొన్ని చిత్రాలు, వెబ్ సిరీస్‍లో వివిధ ఓటీటీల్లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాయి. ఇందులో కొన్ని రిలీజ్‍లు ఆసక్తికరంగా ఉన్నాయి. అల్లు అర్జున్ భారీ బ్లాక్‍‍బస్టర్ మూవీ పుష్ప 2 ఇదే వారంలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. శివాజీ మహారాజ్ నిధి బ్యాక్‍డ్రాప్‍లో ఓ సిరీస్ స్ట్రీమింగ్‍కు రానుంది. ఓ తెలుగు యాక్షన్ మూవీ నేరుగా వచ్చేయనుంది. ఈ జనవరి లాస్ట్ వీక్ ఓటీటీల్లోకి రానున్న టాప్-5 రిలీజ్‍లు ఏవో ఇక్కడ చూడండి.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2: ది రూల్ చిత్రం ఈ వారమే జనవరి 30వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. గత నెల డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజైన ఈ యాక్షన్ మూవీ రూ.1,850 కోట్ల గ్రాస్ కలెక్షన్లకు పైగా దక్కించుకుంది. ఈ క్రమంలో చాలా రికార్డులను తిరగరాసింది. సుకుమార్...