Hyderabad, ఫిబ్రవరి 24 -- OTT Top Releases This Week Telugu: ఓటీటీలోకి ఈ వారం అంటే ఫిబ్రవరి 24 నుంచి మార్చి 2 వరకు టాప్ 6 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో బోల్డ్ నుంచి ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్ సినిమాల వరకు ఉన్నాయి. మరి అవేంటీ, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో లుక్కేద్దాం.

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోని బోల్డ్ వెబ్ సిరీస్‌ల్లో ఆశ్రమ్ సీజన్ ఒకటి. యానిమల్ విలన్ బాబీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్‌ ఇప్పటివరకు మూడు సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు తాజాగా ఆశ్రమ్ మూడో సీజన్ పార్ట్ 2 కూడా రానుంది. ఏక్ బద్నామ్ ఆశ్రమ్ సీజన్ 3 పార్ట్ 2 ఎమ్ఎక్స్ ప్లేయర్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

హిందీతోపాటు తెలుగు, తమిళం, బెంగాలీ భాషల్లో ఫిబ్రవరి 27 నుంచి అమెజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్‌లో ఆశ్రమ్ 3 పార్ట్ 2 ఓటీటీ రిలీజ్ కానుంది. అది కూడా ఫ్రీగా చూసేల...