Hyderabad, ఫిబ్రవరి 3 -- OTT Top 3 Malayalam Movies: మలయాళం సినిమా లవర్స్ కు గుడ్ న్యూస్. ఈ వారం మూడు ఇంట్రెస్టింగ్ మూవీస్ ఓటీటీలోకి అడుగుపెట్టబోతున్నాయి. రేఖాచిత్రమ్, స్వర్గం, వాలియెట్టాన్ లాంటి సినిమాలు ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ మూవీస్ ఎప్పుడు, ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్ లోకి వస్తున్నాయో ఇక్కడ తెలుసుకోండి.

ఓటీటీలోకి ప్రతి వారంలాగే ఈ వారం కూడా సూపర్ హిట్ మలయాళం సినిమాలు రాబోతున్నాయి. సోనీలివ్, మనోరమ మ్యాక్స్ లాంటి ప్లాట్‌ఫామ్స్ లోకి ఈ మూవీస్ వస్తున్నాయి. అవేంటో చూడండి.

ఈ ఏడాది జనవరి 9న రిలీజైన మలయాళం మూవీ రేఖాచిత్రమ్. ఆసిఫ్ అలీ నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ బుధవారం (ఫిబ్రవరి 5) నుంచి సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. కేవలం రూ.9 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.55 కోట్లు వసూలు చేసింది. జొఫిన...