భారతదేశం, మార్చి 20 -- ఓటీటీల్లో కొత్త సినిమాలు చూడాలనుకుంటున్నారా.. అయితే నేడు (మార్చి 21) మూడు ముఖ్యమైన చిత్రాలు స్ట్రీమింగ్‍కు వచ్చేశాయి. మలయాళంలో బ్లాక్‍బస్టర్ అయిన ఆఫీసర్ ఆన్ డ్యూటీ చిత్రం స్ట్రీమింగ్ కోసం చాలా మంది నిరీక్షించారు. ఈ మూవీ నేడు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. బ్రహ్మా ఆనందంతో పాటు మరో తెలుగు చిత్రం కూడా స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. నేడు ఓటీటీల్లోకి తెలుగులో వచ్చిన టాప్-3 చిత్రాలు ఇవే..

మలయాళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ఆఫీసర్ ఆన్ డ్యూటీ నేడు (మార్చి 20) నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అడుగుపెట్టింది. కుంచకో బోబన్, ప్రియమణి ప్రధాన పాత్రలు పోషించిన ఈ థ్రిల్లర్ చిత్రం థియేటర్లలో మంచి హిట్ అయింది. రూ.12 కోట్ల బడ్జెట్‍తో తెరకెక్కిన ఈ మూవీ రూ.50...