భారతదేశం, మార్చి 25 -- ఓటీటీలో నేడు (మార్చి 25) రెండు ఇంట్రెస్టింగ్ చిత్రాలు స్ట్రీమింగ్‍కు వచ్చాయి. డిఫరెంట్ స్టోరీలైన్‍తో వచ్చిన మిస్టర్ హౌస్‍కీపింగ్ ఓటీటీలోకి అడుగుపెట్టింది. ధనుష్ హీరోగా నటించిన తొలి హాలీవుడ్ చిత్రం 'ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్' చిత్రం ఓ మెలికతో ఓటీటీలోకి నేడే వచ్చేసింది. ఈ రెండు చిత్రాలు ఎక్కడ చూడొచ్చో ఇక్కడ తెలుసుకోండి.

మిస్టర్ హౌస్‍కీపింగ్ చిత్రం నేడు రెండు ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఆహా తమిళ్, టెంట్‍కొట్టా ఓటీటీల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. తన లవ్‍ను రిజెక్ట్ చేసిన అమ్మాయి ఇంట్లోనే అబ్బాయి పనిమనిషిగా చేయడం, ఆ తర్వాత ఏం జరిగిందనే అంశాల చుట్టూ ఈ మూవీ సాగుతుంది.

మిస్టర్ హౌస్‍కీపింగ్ మూవీలో హరి భాస్కర్, లోసిల్య మరియనేసన్, రాయన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అర...