భారతదేశం, ఫిబ్రవరి 7 -- టాలీవుడ్ హీరోయిన్‌గా సూపర్ క్రేజ్ సంపాదించుకుంది బ్యూటిఫుల్ శ్రీలీల. అలాగే, తన అదిరిపోయే స్టెప్పులతో మెస్మరైజ్ చేసిన శ్రీలీల డ్యాన్సింగ్ క్వీన్‌గా పేరు తెచ్చుకుంది. అలాంటి శ్రీలీల తమిళంలో ఎంట్రీ ఇచ్చిన సినిమా పరాశక్తి.

తమిళంలో పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన పరాశక్తి సినిమాలో హీరోగా శివ కార్తికేయన్ చేశాడు. అలాగే, తమిళ స్టార్ హీరో జయం రవి పరాశక్తి సినిమాలో విలన్‌గా చేయడం విశేషం. అంతేకాకుండా పరాశక్తి సినిమాలో మరో హీరో అథర్వ మురళి కీలక పాత్ర పోషించాడు.మరో కోలీవుడ్ హీరో జీవీ ప్రకాష్ కుమార్ పరాశక్తి సినిమాకు సంగీతం అందించారు.

గురు, ఆకాశమే నీ హద్దురా వంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన లేడి డైరెక్టర్ సుధ కొంగర పరాశక్తి సినిమాకు దర్శకత్వం వహించడం మరో హైలెట్. ఇలాంటి రేర్ అండ్ డిఫరెంట్ కాంబినేషన్‌లో వచ్చిన పరాశక...