Hyderabad, మార్చి 24 -- OTT Thriller Web Series: టెర్రరిజం, అండర్ కవర్ ఆపరేషన్ చుట్టూ తిరుగుతూ మంచి థ్రిల్ పంచిన వెబ్ సిరీస్ అదృశ్యం ది ఇన్విజిబుల్ హీరోస్. గతేడాది ఏప్రిల్లో సోనీ లివ్ ఓటీటీలోకి తొలి సీజన్ వచ్చింది. ఈ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇప్పుడు రెండో సీజన్ ను తీసుకొస్తున్నారు. తాజాగా సోమవారం (మార్చి 24) ట్రైలర్ రిలీజ్ తోపాటు స్ట్రీమింగ్ తేదీ కూడా అనౌన్స్ చేశారు.

అదృశ్యం ది ఇన్విజిబుల్ అనేది ఓ హిందీ థ్రిల్లర్ వెబ్ సిరీస్. గూఢచర్యం చుట్టూ తిరిగే కథతో వచ్చి ప్రేక్షకులకు మంచి థ్రిల్ పంచింది. గతేడాది ఏప్రిల్ 11 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు రెండో సీజన్ కూడా సరిగ్గా ఏడాది తర్వాత అంటే ఏప్రిల్ 4 నుంచి సోనీ లివ్ లోనే స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ట్రైలర్ రిలీజ్ చేస్తూ ఆ ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా...