భారతదేశం, ఏప్రిల్ 22 -- ఓటీటీల్లో కొన్ని తమిళ థ్రిల్లర్ వెబ్ సిరీస్‍లు బాగా సక్సెస్ అయ్యాయి. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో కొన్ని సిరీస్‍లకు ఆదరణ బాగా దక్కింది. సుజల్ సహా మరిన్ని తమిళ థ్రిల్లర్ సిరీస్‍లు ప్రైమ్ వీడియోలో అదరగొట్టాయి. బాగా పాపులర్ అయ్యాయి. ప్రేక్షకులకు థ్రిల్ పంచాయి. వాటిలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్-5 తమిళ థ్రిల్లర్ సిరీస్‍లు ఏవో ఇక్కడ తెలుసుకోండి.

తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సుడల్: ది వర్టెక్స్.. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో చాలా విజయవంతం అయింది. ఐశ్వర్య రాజేశ్, ఖాతిర్ లీడ్ రోల్స్ చేసిన ఈ సిరీస్ ఫస్ట్ సీజన్ 2022లో వచ్చి సూపర్ సక్సెస్ అయింది. మర్డర్ మిస్టరీల చుట్టూ ఈ సిరీస్‍ను థ్రిల్లింగ్‍గా, గ్రిప్పింగ్‍గా తీసుకొచ్చారు క్రియేటర్లు పుష్కర్ - గాయత్రి. ఫస్ట్ సీజన్ ఎంతో హిట్ అయింది. సుడల్ వెబ్ సిరీస్‍లో రెండో సీజ...