భారతదేశం, మార్చి 2 -- డబ్బా కార్టెల్ వెబ్ సిరీస్ చాలా హైప్ మధ్య వచ్చింది. షాబానా అజ్మీ, జ్యోతిక, నిమిషా సంజయన్, షాలినీ పాండే లాంటి పాపులర్ నటీమణులు ఈ సిరీస్‍లో కలిసి నటించడంతో మరింత హైప్ నెలకొంది. ట్రైలర్ తర్వాత ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ క్యూరియాసిటీని మరింత పెంచేసింది. అందుకు తగ్గట్టే స్ట్రీమింగ్‍కు వచ్చాక డబ్బా కార్టెల్ సత్తాచాటుతోంది. అప్పుడే ఓటీటీ ట్రెండింగ్‍లో ఫస్ట్ ప్లేస్‍కు వచ్చేసింది.

డబ్బా కార్టెల్ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 28వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. హిందీలో రూపొందిన ఈ సిరీస్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల డబ్బింగ్‍లోనూ ఎంట్రీ ఇచ్చింది. ఈ సిరీస్‍కు మొదటి నుంచి వ్యూస్ భారీగా వచ్చేశాయి. దీంతో నెట్‍ఫ్లిక్స్ ఇండియా వెబ్ సిరీస్ విభాగం ట్రెండింగ్‍లో డబ్బా కార్టెల్ టాప్ ప్లేస్‍కు దూసుకొచ్చేసింది.

డబ్బా కార్...