Hyderabad, ఫిబ్రవరి 11 -- OTT Thriller Movies: థ్రిల్లర్ జానర్ అంటే ఇష్టమా? ఓటీటీలో ఈ జానర్లో ఏ సినిమా వచ్చినా వదలకుండా చూస్తారా? అయితే ఈ రెండు మూవీస్ మీకోసమే. వీటిలో ఒకటి మలయాళం కాగా.. మరొకటి తమిళం సినిమా. ఈ రెండూ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్నాయి. టొవినో థామస్ నటించిన ఐడెంటిటీ, జీవా నటించిన డార్క్ (తమిళంలో బ్లాక్) మూవీస్ మంచి థ్రిల్ పంచుతున్నాయి.

ఓటీటీలోకి తరచూ థ్రిల్లర్ జానర్లో చాలా సినిమాలు, వెబ్ సిరీస్ వస్తూనే ఉంటాయి. అలా ఈ మధ్యే రెండు వేర్వేరు ఓటీటీల్లోకి ఈ ఐడెంటిటీ, డార్క్ మూవీస్ వచ్చాయి. అసలు ఊహకందని ట్విస్టులతో సాగే ఈ మూవీస్ మంచి థ్రిల్ పంచుతాయి. మరి ఈ సినిమాను ఎందుకు, ఎక్కడ చూడాలన్న విషయాలు ఇక్కడ చూడండి.

తమిళ నటుడు జీవా, ప్రియా భవానీ శంకర్ నటించిన మూవీ ఇది. తమిళంలో బ్లాక్ పేరుతో గతేడాది అక్టోబర్లో రిలీజైంది. తెలుగులో మాత్రం న...