Hyderabad, మార్చి 27 -- OTT Thriller Movies: మలయాళం స్టార్ హీరోల్లో ఒకడు కుంచకో బొబన్ (Kunchako Boban). అతడు నటించిన ఎన్నో సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యాయి. ఈ మధ్యే నెట్‌ఫ్లిక్స్ లోకి ఆఫీసర్ ఆన్ డ్యూటీ అనే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వచ్చింది. ఫిబ్రవరిలో రిలీజై సంచలన విజయం సాధించిందీ మూవీ. మరి కుంచకో నటించిన మరిన్ని థ్రిల్లర్ మూవీస్ కూడా ఓటీటీలో ఉన్నాయి. అవేంటో చూడండి.

కుంచకో బొబన్ గతంలో వైరస్, 2018, బౌగేన్‌విల్లే, నిజల్, నాయట్టు, అంజామ్ పతీరా లాంటి థ్రిల్లర్ సినిమాల్లో నటించాడు. ఈ మూవీస్ ప్రస్తుతం సోనీ లివ్, జీ5, ఆహా వీడియోలాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో అందుబాటులో ఉన్నాయి.

నాయట్టు ఓ తప్పుడు హత్య కేసులో ఇరుక్కొన్న ముగ్గురు పోలీసుల చుట్టూ తిరిగే స్టోరీ. ఇందులో కుంచకోతోపాటు జోజు జార్జ్, నిమిషా సజయన్ కూడా నటించారు. తమను తప్పుడు కేసులో ఇరికించార...