Hyderabad, మార్చి 28 -- OTT Thriller Movie: థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారి కోసం ఇప్పుడో హైస్ట్ థ్రిల్లర్ ఓటీటీలోకి వస్తోంది. ఈ మూవీ పేరు జువెల్ థీఫ్ - ది హైస్ట్ బిగిన్స్. డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్, జైదీప్ అహ్లావత్ నటిస్తున్నారు. శుక్రవారం (మార్చి 28) మేకర్స్ ఈ మూవీ కొత్త పోస్టర్ తోపాటు రిలీజ్ తేదీని అనౌన్స్ చేశారు.

మరో బాలీవుడ్ మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి వస్తోంది. జువెల్ థీఫ్ ది హైస్ట్ బిగిన్స్ మూవీ ఏప్రిల్ 25 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. కూకీ గులాటీ, రాబీ గ్రేవాల్ డైరెక్ట్ చేసిన ఈ హైస్ట్ థ్రిల్లర్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ ఓ మోసగాడి పాత్రలో నటిస్తుండగా.. జైదీప్ అహ్లావత్ ఓ మాఫియా బాస్ పాత్ర పోషిస్తున్నాడు. కునాల్ కపూర్, నికితా దత్తాలాంటి వా...