Hyderabad, మార్చి 3 -- OTT Thriller Movie: తెలుగు డ్రామా థ్రిల్లర్ మూవీ రామం రాఘవం ఓటీటీ రిలీజ్ పై కీలకమైన అప్డేట్ వచ్చేసింది. గత నెల 21వ తేదీని థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. దీంతో నెల రోజుల్లోపే మూవీ డిజిటల్ ప్రీమియర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

జబర్దస్త్ కమెడియన్ ధనరాజ్ డైరెక్ట్ చేసి, నటించిన మూవీ రామం రాఘవం. ఈ మూవీలో సముద్రఖని కీలకపాత్ర పోషించాడు. ఈ మూవీ డిజిటల్ హక్కులను ఈటీవీ విన్ ఓటీటీ సొంతం చేసుకుంది. సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సోమవారం (మార్చి 3) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

"కొన్ని యుద్ధాలు కుటుంబాల్లోనే ఉంటాయి. కానీ ఇది మాత్రం బిగ్ స్క్రీన్ పై దుమారం రేపింది. రీసెంట్ బ్లాక్‌బస్టర్ కోసం సిద్ధంగా ఉండండి. త్వరలోనే ఈటీవీ విన్ లోకి వస్తోంది" అనే క్యా...