Hyderabad, ఏప్రిల్ 17 -- OTT Thriller Movie: గోవా స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్ లో ఇప్పుడు ఓటీటీలోకి ఓ థ్రిల్లర్ మూవీ వస్తోంది. ఈ సినిమా ట్రైలర్ ను గురువారం (ఏప్రిల్ 17) రిలీజ్ చేశారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమాను జీ5 ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుంది. ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకునేలా సాగింది.

జీ5 ఓటీటీలోకి నేరుగా వస్తున్న ఆ థ్రిల్లర్ మూవీ పేరు కోస్టావో (Costao). ఇది 1990లనాటి గోవా స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే సినిమా. ఇప్పుడంటే గోవా అనగానే అందమైన బీచ్‌లు, ఓ మంచి పర్యాటక ప్రదేశంగానే అందరికీ తెలుసు. కానీ మూడు దశాబ్దాల కిందట ఇది గోల్డ్ స్మగ్లింగ్ కు అడ్డా. ఆ పాయింట్ ఆధారంగానే ఈ కోస్టావో మూవీ వస్తోంది. ఈ సినిమా మే 1 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

కొన్ని రోజుల కిందట ఈ సినిమాను అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ.. తాజాగా ట్రైలర్ ల...