Hyderabad, ఏప్రిల్ 10 -- OTT Thriller Movie: తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ యమకాతగి (Yamakaathagi). ఈ సినిమా మార్చి 7న థియేటర్లలో రిలీజైంది. ఓ అమ్మాయి ఆత్మహత్య, అంత్యక్రియల కోసం కదలని ఆమె శవం ఓ ఊళ్లోవాళ్లకు ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చిందన్నది ఈ సినిమాలో చూడొచ్చు.

తమిళ థ్రిల్లర్ మూవీ యమకాతగి మూవీ ఆహా తమిళం ఓటీటీలోకి రానుంది. ఏప్రిల్ 14 నుంచి మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు గురువారం (ఏప్రిల్ 10) ఆ ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

"ఎదురుచూపులు ఫలించాయి. ఏప్రిల్ 14 నుంచి యమకాతగి మన ఆహా తమిళం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది" అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. ఇదే ఓటీటీలో శుక్రవారం (ఏప్రిల్ 11) నుంచి వెబ్ అనే మరో తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా కూడా స్ట్రీమింగ్ కానున్న విషయం తెలిసిందే.

యమకాతగి మూవీని పెపిన్ జార...