Hyderabad, ఏప్రిల్ 17 -- Tharai Thappattai OTT Release: హనుమాన్ సినిమాతో నటిగా తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకుంది వరలక్ష్మీ శరత్ కుమార్. సీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వరలక్ష్మీ శరత్ కుమార్ మొదట కోలీవుడ్‌లో హీరోయిన్‌గా డెబ్యూ ఎంట్రీ ఇచ్చింది.

అయితే, తమిళంలో హీరోయిన్‌గా పెద్దగా క్లిక్ అవ్వని వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రాధాన్యత గల పాత్రల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే తెలుగులో నాంది సినిమాతో ఇంపార్టెంట్ రోల్‌లో నటించి పాపులర్ అయింది. ఆ తర్వాత రవితేజ క్రాక్, బాలకృష్ణ వీర సింహారెడ్డి, సమంత యశోద సినిమాల్లో విలన్‌గా ఆకట్టుకుంది.

ఇక హనుమాన్ సినిమాలో హీరో తేజ సజ్జాకు అక్కగా చేసి దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకుంది. అయితే, వరలక్ష్మీ శరత్ కుమార్ హీరోయిన్‌గా చేస్తున్న సమయంలో నటించిన కోలీవుడ్ రివేంజ్ ...