భారతదేశం, ఏప్రిల్ 5 -- హాలీవుడ్ సినిమా 'క్రావెన్ ది హంటర్' చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సూపర్ హీరో థ్రిల్లర్ చిత్రం గతేడాది డిసెంబర్ 13వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీలో ఆరోన్ టేలర్ జాన్సన్ ప్రధాన పాత్ర పోషించారు. జేసీ చందోర్ దర్శకత్వం వహించారు. క్రావెన్ ది హంటర్ చిత్రం ఇప్పుడు ఇండియాలో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది.

క్రావెన్ ది హంటర్ సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో తాజాగా స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఇంగ్లిష్‍తో పాటు తెలుగు, హిందీ, తమిళంలో స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది. నెట్‍ఫ్లిక్స్‌లో నాలుగు భాషల్లో స్ట్రీమ్ అవుతోంది.

క్రావెన్ ది హంటర్ చిత్రంలో ఆరోన్ జాన్సన్‍తో పాటు ఆరియానా డీబోస్, ఫ్రెడ్ హీచింగర్, అలెసాండ్రో నివోలా, క్రిస్టఫర్ అబాట్, మురాత్ సెవెన్ కీరోల్స్ చేశారు. ఈ మూవీకి రిచర్డ్ వెంక్ కథ అందిండగా.. డై...