భారతదేశం, ఏప్రిల్ 14 -- రూపా కడువాయుర్ ప్రధాన పాత్ర పోషించిన యమకాతగి చిత్రం మార్చి 7వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ చిత్రానికి పప్పిన్ జార్జ్ జయశీలన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో నరేంద్ర ప్రసాద్ కూడా ఓ లీడ్ రోల్ చేశారు. ఈ యమకాతగి చిత్రం నేడు ఓటీటీలోకి వచ్చేసింది.

యమకాతగి చిత్రం ఆహా తమిళ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో నేడు (ఏప్రిల్ 14) స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. తమిళ్‍లో స్ట్రీమ్ అవుతోంది.

తెలుగు హీరోయిన్ రూపా కొడువాయూర్.. యమకాతగి మూవీతోనే తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తెలుగులో ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య, మిస్టర్ ప్రెగ్నెంట్ చిత్రాల్లో రూప నటించారు. ఆ తర్వాత యమకాగతితో కోలీవుడ్‍లోకి ఎంట్రీ ఇచ్చారు. డిఫరెంట్ పాత్ర అయిన యాక్టింగ్ పర్ఫార్మెన్స్‌తో మెప్పించారు రూప.

యమకాతగి మూవీని సూపర్ నేచురల్ చిత్రంగా తెరకెక్కించారు డైర...