భారతదేశం, ఫిబ్రవరి 5 -- OTT Thriller: త‌మిళ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ 54321 థియేట‌ర్ల‌లో రిలీజైన తొమ్మిదేళ్ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చింది. బుధ‌వారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్రీగా కాకుండా 99 రూపాయ‌ల రెంట‌ల్‌తో మేక‌ర్స్ ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేశారు.

ఈ థ్రిల్ల‌ర్ మూవీలో ఆర్విన్‌, ష‌బ్బీర్‌, ప‌విత్రా గౌడ‌, రోహిణి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. రాఘ‌వేంద్ర ప్ర‌సాద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. వెరైటీ టైటిల్‌తో అప్ప‌ట్లో కోలీవుడ్ ఆడియెన్స్‌లో ఈ మూవీ క్యూరియాసిటీని క‌లిగించింది. ఐదుగురు వ్య‌క్తులు, నాలుగు క‌థ‌లు, మూడు హ‌త్య‌లు, రెండు గంట‌లు ఒక రివేంజ్ అంటూ మేక‌ర్స్ టైటిల్‌కు జ‌స్టిఫికేష‌న్ ఇచ్చారు.

హాలీవుడ్ మూవీ బ‌బేల్ స్ఫూర్తితో ద‌ర్శ‌కుడు ఈ మూవీని తెర‌కెక్కించాడు. రివేంజ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ ఐడియా క...