భారతదేశం, మార్చి 30 -- ఈటీవీ విన్ ఓటీటీలో గతేడాది '90s: ఏ మిడిల్‍క్లాస్ బయోపిక్' వెబ్ సిరీస్ సూపర్ సక్సెస్ అయింది. 1990ల నాటి మధ్యతరగతి కుటుంబ పరిస్థితులను చూపించిన ఈ సిరీస్ ప్రేక్షకులను మెప్పించింది. అప్పటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చి.. చాలా మందికి కనెక్ట్ అయింది. ఇప్పుడు ఇదే పంథాలో మరో తెలుగు వెబ్ సిరీస్ రానుంది. అయితే, స్కూల్ రోజులను గుర్తు చేసేలా ఈ నయా సిరీస్ ఉండనుంది. ఈ సిరీస్‍పై నేడు అనౌన్స్‌మెంట్ వచ్చింది.

ఈటీవీ విన్ ఓటీటీ నేడు (మార్చి 30) ఉగాది రోజున కొత్త వెబ్ సిరీస్‍ను ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పోస్టర్ తీసుకొచ్చింది. 1997 - 2007 మధ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన ఆనంద్, గణేశ్, శ్రీకాంత్, సంతోష్ అనే నలుగురు అబ్బాయిల చుట్టూ ఈ సిరీస్ ఉండనుంది. ఆ స్నేహితులు ఇప్పుడు పెద్దయ్యాక మళ్లీ ఆ పాఠశాలకు వచ్చి జ్ఞాపకాలను గుర్తు చేసు...