Hyderabad, ఏప్రిల్ 15 -- OTT Telugu Web Series: ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఒకటైన ఆహా వీడియో ఓటీటీ ఈ నెల మొదట్లో తీసుకొచ్చిన వెబ్ సిరీస్ హోమ్ టౌన్ (Home Town). ఈ ఫ్యామిలీ డ్రామా సిరీస్ ఇప్పుడు సంచలనాలు సృష్టిస్తోంది. పది రోజుల్లోనే 10 కోట్ల స్ట్రీమింగ్ మినట్స్ మార్క్ అందుకోవడం విశేషం.

ఆహా వీడియో ఓటీటీలో ఏప్రిల్ 4 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న వెబ్ సిరీస్ హోమ్ టౌన్. శ్రీకాంత్ రెడ్డి పల్లె డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ లో రాజీవ్ కనకాల, ఝాన్సీలాంటి వాళ్లు నటించారు. ఈ సిరీస్ పది రోజుల్లోనే ఈ ఓటీటీలో 10 కోట్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డును అందుకోవడం విశేషం.

ఈ విషయాన్ని ఆ ఓటీటీయే వెల్లడించింది. అయితే దీనికోసం ఆ ఓటీటీ ఎంచుకున్న మార్గం కూడా ఆసక్తికరంగా ఉంది. ఈ మధ్యే ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ అభిషేక్ శర్మ సెంచరీ కొట్టిన తర్వాత తన జే...