Hyderabad, ఏప్రిల్ 4 -- OTT Telugu Romantic Comedy: ఓటీటీలోకి గతవారం అడుగుపెట్టిన తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ మజాకా. సందీప్ కిషన్ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమా గత నెల్లో థియేటర్లలో రిలీజై ఓ మోస్తరు విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఓటీటీలో మాత్రం ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. వారంలోనే 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ మార్క్ అందుకుంది.

మజాకా మూవీ ఉగాదికి ముందు అంటే మార్చి 28న జీ5 ఓటీటీలోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచే ఈ ఓటీటీలో టాప్ ట్రెండింగ్ సినిమాల్లో తొలి స్థానంలో ఉంది. ఇక తాజాగా 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డును కూడా సొంతం చేసుకుంది. ఇప్పటికే టాప్ లోనే ట్రెండ్ అవుతోంది. త్రినాథ రావు నక్కిన దర్శకత్వం వహించిన మజాకా చిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. కామెడీ, రొమాన్స్, తండ్రీకొడుకుల సెంటిమెంట్ ఇలా అన్ని అంశాలతో తెరకెక్కి...