Hyderabad, ఫిబ్రవరి 7 -- OTT Telugu Romantic Comedy: ట్రయాంగిల్ లవ్ స్టోరీతో ఓ రొమాంటిక్ కామెడీ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. ఈటీవీ విన్ ఓటీటీ సమ్మేళనం పేరుతో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. మూవీ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేస్తూ ఆ ఓటీటీ ఓ కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. మరి ఈ మూవీ ఏంటి? ఇతర స్ట్రీమింగ్ వివరాలను ఒకసారి చూద్దాం.

ఈటీవీ విన్ ప్రేక్షకులకు అందిస్తున్న మరో ఒరిజినల్ మూవీ సమ్మేళనం (Sammelanam). ఈ సినిమా ఫిబ్రవరి 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని శుక్రవారం (ఫిబ్రవరి 7) ఆ ఓటీటీ వెల్లడించింది. "సమ్మేళనం.. ప్రేమ, నవ్వులు, క్రేజీ లవ్ ట్రయాంగిల్. గందరగోళం మొదలైంది.

ఫిబ్రవరి 20 నుంచి ఈటీవీ విన్ లో" అనే క్యాప్షన్ తో ఈ సమ్మేళనం మూవీ పోస్టర్ ను రిలీజ్ చేశారు. కొత్త నటీనటులతో రూపొందిన సినిమాగా పోస్టర్ చూస్తే తెలుస్తోంది....