Hyderabad, ఏప్రిల్ 14 -- OTT Telugu Movies: కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ మూవీ థియేటర్లలోనే కాదు ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లోనూ సంచలనాలు సృష్టిస్తోంది. ప్రియదర్శి ఓ లాయర్ గా నటించిన ఈ మూవీ ప్రేక్షకులను అలరిస్తోంది. పోక్సో చట్టాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో ఈ సినిమా కళ్లకు కట్టే ప్రయత్నం చేసింది. ఈ కోర్ట్ రూమ్ డ్రామా మీకు కూడా నచ్చిందా? ఇలాంటివే తెలుగులో మరికొన్ని మూవీస్ కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో అందుబాటులో ఉన్నాయి. అవేంటో చూడండి.

పవన్ కల్యాణ్ నటించిన బ్లాక్‌బస్టర్ కోర్ట్ రూమ్ డ్రామా వకీల్‌సాబ్. హిందీలో అమితాబ్ బచ్చన్ నటించిన పింక్ సినిమాకు ఇది రీమేక్. ముగ్గురు అమ్మాయిల చుట్టూ తిరిగే కథ ఇది. ఆ అమ్మాయిలను బలవంతం చేయబోయిన యువకులు, వాళ్లకు శిక్ష పడేలా చేసే ఓ వకీలు కథే ఈ మూవీ.

సూర్య నటించిన ఈ తమిళ సినిమా దేశాన్ని ఊపేసింది. దేశంలో ఇప్పటిక...