భారతదేశం, ఏప్రిల్ 2 -- తెలుగు ఓటీటీ ప్లాట్‍ఫామ్ 'ఈటీవీ విన్' వరుసగా సినిమాలు, సిరీస్‍లను తీసుకొస్తోంది. ఇటీవల ఈ ఓటీటీ మరింత దూకుడు పెంచింది. నయా కంటెంట్‍ను తీసుకొస్తూనే ఉంది. ఈ క్రమంలో ఈనెల ఏప్రిల్‍లోనూ ఈటీవీ విన్‍లో కొన్ని సినిమాలు అడుగుపెట్టనున్నాయి. ఏడు చిత్రాలు రానున్నాయి. వాటి స్ట్రీమింగ్ తేదీలను ఈటీవీ విన్ నేడు (ఏప్రిల్ 2) ప్రకటించింది.

ఉద్వేగం సినిమా రేపు (ఏప్రిల్ 3) ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ లీగల్ కోర్ట్ రూమ్ డ్రామా మూవీలో త్రిగుణ్, దీప్సిక, శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం గతేడాది నవంబర్ 29వ తేదీన థియేటర్లలో విడులదైంది. నాలుగు నెలల తర్వాత ఉద్వేగం చిత్రం ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి వస్తోంది. ఈ మూవీకి మహిపాల్ రెడ్డి దర్శకత్వం వహించారు.

ఏప్రిల్ 6వ తేదీన ఈటీవీ విన్ ఓటీటీలో...