Hyderabad, ఏప్రిల్ 4 -- OTT Telugu Movie: పెద్ద కలలు కనడానికి వయసుతో సంబంధం లేదు అని చాటి చెప్పే తెలుగు సినిమా ముత్తయ్య (Muthayya). రెండున్నరేళ్ల కిందట థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడీ సినిమాను ఈటీవీ విన్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయబోతోంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ శుక్రవారం (ఏప్రిల్ 4) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

తెలుగు మూవీ ముత్తయ్య 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అప్పటి నుంచీ డిజిటల్ ప్రీమియర్ కు నోచుకోలేదు. మొత్తానికి ఈ సినిమాను త్వరలోనే తమ ఓటీటీలోకి తీసుకురానున్నట్లు ఈటీవీ విన్ వెల్లడించింది.

"కలలకు వయసు లేదు. 70 ఏళ్ల ఓ వృద్ధుడు నటించాలన్న తన కలను ఛేదించే కథను చూడండి. మీ ఈటీవీ విన్ లో త్వరలో" అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ ఈ మూవీ స్ట్రీమింగ్ విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ మూవీ పోస్టర్ ను కూడా పోస్ట్ చేసింది.

ముత్తయ్య మూవీ ఆ పేరు క...