Hyderabad, ఏప్రిల్ 3 -- OTT Telugu Movie: ఓటీటీలోకి తెలుగు మూవీ ఉద్వేగం స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ మూవీ గతేడాది నవంబర్ 29న థియేటర్లలో రిలీజైంది. ఐఎండీబీలోనూ ఏకంగా 8.3 రేటింగ్ సాధించింది. ఇప్పుడీ మూవీ డిజిటల్ ప్రీమియర్ అయింది. ఒక కేసు చుట్టూ సాగే కోర్టు రూమ్ డ్రామా ఇది. రిలీజ్ సమయంలోనే పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.

తెలుగు కోర్ట్ రూమ్ డ్రామా ఉద్వేగం గురువారం (ఏప్రిల్ 3) నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీని ఓటీటీలోకి తీసుకొచ్చే ముందు కూడా ఆ ప్లాట్‌ఫామ్ పెద్దగా ప్రమోషన్లు నిర్వహించేలేదు. సైలెంట్ గా తీసుకొచ్చేసింది. స్ట్రీమింగ్ ప్రారంభమైన తర్వాత ఈ విషయాన్ని వెల్లడించింది.

"ఒక్క కేసు.. ఎన్నో ట్విస్టులు. చివరికి సత్యం జయిస్తుందా? ఈ గ్రిప్పింగ్ కోర్టు రూమ్ డ్రామాను చూడండి కేవలం ఈటీవీ విన్ ఓటీటీలో" అనే క్యాప్షన్ తో మూవీ స్ట్రీమిం...