Hyderabad, ఏప్రిల్ 7 -- OTT Telugu Horror Comedy: ఈటీవీ విన్ ఓటీటీ మరో ఇంట్రెస్టింగ్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. ఈ మూవీ గత నెల 21న థియేటర్లలో రిలీజైంది. అయితే మూడు వారాల్లోనే డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధం కావడం విశేషం. ఈ విషయాన్ని గత వారమే వెల్లడించిన ఆ ఓటీటీ.. సోమవారం (ఏప్రిల్ 7) మరోసారి ట్వీట్ చేసింది.

కోర్ట్ మూవీ ఫేమ్ రోషన్ నటించిన మూవీ టుక్ టుక్. గత నెల 21న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఈ గురువారం అంటే ఏప్రిల్ 10 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలోకి రాబోతోంది. ఈ నెలలో రిలీజ్ కాబోయే సినిమాంటూ గత వారమే ఈ విషయాన్ని వెల్లడించిన ఆ ఓటీటీ.. తాజాగా మరోసారి ఓ ట్వీట్ ద్వారా ఇదే విషయం తెలిపింది.

"జీవితకాలపు ప్రయాణంలో మీరూ పాలుపంచుకోండి. టుక్ టుక్ ఈటీవీ విన్ లో ఏప్రిల్ 10న ప్రీమియర్ కానుంది. ఓ సరదా, భయపెట్టే, ఎమోషనల్ జర్నీ మీ కోసం వేచి చూస్త...