భారతదేశం, మార్చి 1 -- తెలుగులో మరో ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్ రానుంది. 'హోమ్ టౌన్' పేరుతో ఈ సిరీస్ వస్తోంది. సూపర్ సక్సెస్ అయిన '#90s: ది మిడిల్ క్లాస్ బయోపిక్' ప్రొడ్యూజ్ చేసిన నవీన్ మేడారం నిర్మాణంలో ఈ నయా సిరీస్ రూపొందుతోంది. దీంతో 'హోమ్ టౌన్' సిరీస్‍పై మంచి ఆసక్తి నెలకొంది. రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యద్మ ఈ సిరీస్‍లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‍కు శ్రీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్‍ నేడు ఖరారైంది.

హోమ్ టౌన్ వెబ్ సిరీస్ ఏప్రిల్ 4వ తేదీన ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని నేడు ఆహా నేడు (మార్చి 1) అధికారికంగా వెల్లడించింది. "జ్ఞాపకాలు, ప్రేమ, లక్ష్యాల ప్రయాణం. హోమ్ టౌన్ స్టోరీ మీ సొంత కథలా అనిపిస్తుంది. ఏప్రిల్ 4 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది" అని ఆహా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింద...