Hyderabad, ఏప్రిల్ 19 -- Hidimbha OTT Release: ఓటీటీలో డిఫరెంట్ కంటెంట్ సినిమాలకు కొదవలేదు. ఇతర భాషల్లోనే కాకుండా తెలుగులో కూడా విభిన్నమైన కథాంశంతో సినిమాలు తెరకెక్కాయి. అలాంటి వాటిలో హిడింబ మూవీ ఒకటి. యాంకర్ ఓంకార్ తమ్ముడిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన అశ్విన్ బాబు హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం గట్టిగానే చేస్తున్నాడు.

ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం అంటే 2023లో వచ్చిన సినిమానే హిడింబ. తెలుగులో సైకలాజికల్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన హిడింబతో అశ్విన్ బాబు ప్రయోగం చేశాడనే చెప్పాలి. అయితే, ఈ ప్రయోగం బాక్సాఫీస్ వద్ద పెద్దగా వర్కౌట్ కాలేదు. కానీ, ఓటీటీలోకి రిలీజ్ అయ్యాక మాత్రం మంచి పేరు తెచ్చుకుంది.

నిజానికి తెలుగులో ఇలాంటి తరహా సినిమాలు రాలేదు. ఒక యూనిక్ పాయింట్‌తో వచ్చిన హిడింబ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ అయినప్పటికీ ఓటీటీలో మాత్రం అదరగొట్టిం...